సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగకు ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల అయిన ఘటనలు గత ఏడాది చోటు చేసుకోవడంతో ఈ ఏడాది అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి దొంగతనాల ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి, ఇన్సిడెంట్ ఫ్రీగా ఈ సంక్రాంతి పండుగ జరిగేందుకు క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. ప్రధానంగా శివారు ప్రాంతాలనే దొం గలు టార్గెట్ చేసే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలోనే శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని ఆయా ఠాణాల ఎస్హెచ్ఓలకు ఆదేశాలు అందాయి. బీఆర్ఎస్ హయాంలో ఇండ్లకు తాళం వేసి ఎలాంటి అపోహలు లేకుండా పండుగలకు నగరవాసులు ఉరెళ్లేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది నేరాలు భారీగా పెరగ డం, పెట్రోలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో టు పాత నేరస్థులు మళ్లీ దొంగతనాల బాటపడుతుండడంతో ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్‌లోని వాతావరణం తిరిగి వచ్చిందనే ఆందోళన నెలకొంది. దీంతో ఈ ఏడాది సం కాంత్రి పండుగకు ఉరెళ్లేవారు చాలామంది కుటుంబ సమేతకంగా కాకుండా, ఇంట్లో ఎవరో ఒకరు ఉండేలా చూసుకున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి..
ఇప్పటికే ట్రై పోలీస్ కమిషనరేట్లలోని పోలీసులు పండుగకు ఊరేళ్ల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ధైర్యంగా ఉండాలంటూ పలు సూచనలు చేశారు. మేమున్నామనే భరోసాను కల్పించారు. అయితే గత ఏడాది క్రైమ్ రేట్ పెరగడంతో ప్రజలు భయం వీడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు జాగ్రత్తలు చెప్పినా, మన జాగ్రత్తలో మనం ఉండాలనే ఆలోచనలో కొందరు ఉండగా, పోలీసులు చూసుకుంటారనే ధోరణిలో మరికొందరు ఉన్నారు. పండుగలతో సంబంధం లేకుండా ట్రై పోలీస్ కమిషనరేట్లలో దొంగలు గత ఏడాది చెలరేగిపోయారు. ధార్ గ్యాంగ్, చడ్డీ, చుడీదార్ గ్యాంగ్‌లు హాల్చల్ చేశాయి. దీంతో ఇంటికి తాళం వేసి వెళ్లేందుకు కొందరు భయపడుతూ ఇంట్లో మేముంటాం, మీ రు వెళ్లండంటూ చర్చించుకొని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకుం టున్నారు.
విజిబుల్ పోలీసింగ్‌తోనే…
విజిబుల్ పోలీసింగ్‌తోనే నేరాలకు చెక్‌పెట్టవచ్చని ట్రై పోలీస్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలోని పోలీసులకు పెట్రోలింగ్‌పై దృష్టి పెట్టాలని సూచనలు చేశారు. పాత నేరస్థుల కదలికలను కనిపెడుతుండాలని, బాధితులు తమ స్వగ్రామాల నుంచి తిరిగి వచ్చిన తరువాతే ఎక్కడైనా దొంగతనాలు జరిగితే బయటకు వస్తాయి. అయితే గ్రామాలకు వెళ్లిన వారు ధైర్యంగా ఉంటూ సంతోషంగా పండుగలు చేసుకోవాలంటే పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేసుకొని విధు ల్లో పెట్రోలింగ్ నిర్వహించాల్సిన అవసరముంది. ఈ సంక్రాంతి పండుగకు ఒక్క దొంగతనం ఘటన కూడా జరగకుండా అందరు అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయి పోలీసులకు దిశా నిర్దేశం చేశారు.