కాంగ్రెస్ వస్తే..దళారులదే రాజ్యం
తద్దినం ఉన్నదని భోజనానికి పిలిస్తే.. మీ ఇంట్లో రోజూ ఇట్లనే జరగాలి అన్నడట.. కాంగ్రెసోళ్ల పని కూడ గిట్లనే ఉన్నది. బీఆర్ఎస్ కన్నా మంచిగ చేస్తామని చెప్పాలి కానీ.. ఉన్నదంతా ఊడగొడతం.. ఎల్లమ్మ ఊడగొడితే మల్లమ్మ మాయం చేసిందన్నట్టు.. ధరణిని తీసేస్తామంటే అర్థమేందీ ? కాంగ్రెస్ వస్తే దళారులదే రాజ్యం.
- మళ్లీ వీఆర్వోలు.. కౌలుదారు కాలమ్‌లు
- ధరణిని తీసి భూమాత పెడ్తరట..
- భూ మాతనా ? భూ మేతనా ?
- ధరణిని తీసేస్తే రైతుబంధు ఎట్లొస్తది ?
- రైతుబంధు.. బిచ్చమా.. ఆత్మగౌరవమా ?
- రైతు సొంతపెట్టుబడితో వ్యవసాయం చేస్తే.. అదే బంగారు తెలంగాణ
- ఏడాదిలోపు పాలమూరు – రంగారెడ్డి సాగునీరు
- రైతు బాగుండాలంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి
- ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు
సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): తద్దినం ఉన్నదని భోజనానికి పిలిస్తే.. మీ ఇంట్లో రోజూ ఇట్లనే జరగాలి అన్నడట.. కాంగ్రెసోళ్ల పని కూడ గిట్లనే ఉన్నది. బీఆర్ఎస్ కన్నా మంచిగ చేస్తామని చెప్పాలి కానీ.. ఉన్నదంతా ఊడగొడతం.. ఎల్లమ్మ ఊడగొడితే మల్లమ్మ మాయం చేసిందన్నట్టు.. ధరణిని తీసేస్తామంటే అర్థమేందీ ? కాంగ్రెస్ వస్తే దళారులదే రాజ్యం.. పైరవీకారులదే ప్రపంచం’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు.

బుధవారం మహబూబ్‌నగర్, కొడంగల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలకు మద్దతుగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ వీఆర్వోలు..కౌలుదారు కాలమ్‌లు వస్తయి. ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తది. ధరణిని తీసేసి భూమాత పెడ్తరట. అది భూ మాతనా? భూ మేతనా ? అని మండిపడ్డారు. ధరణిని తీసేస్తే రైతుబంధు ఎట్ల వస్తది ? రైతు బంధు.. బిచ్చమా.. ఆత్మగౌరవమా ? ఇది రైతులు ఆలోచన చేయాలన్నారు. ఇప్పుడిప్పుడే రైతుల మొఖాలు తెల్లపడుతున్నాయని, రైతు తన సొంత పెట్టుబడితోని వ్యవసాయం చేసుకున్న రోజే బంగారు తెలంగాణ అని… నేను కలగనేది కూడా అదేనన్నారు.

ఏడాదిలోగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించి కొడంగల్ పొలాలకు కృష్ణా జలాలను మళ్ళిస్తానని చెప్పారు. రైతులు బాగుండాలంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలన్నారు. నిరంతరం ప్రజాసంక్షేమానికి, అభివృద్ధికి పాటు పడే బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. కోస్గిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తున్న బీఆర్ ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోస్గిలో జరిగిన కొడంగల్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా హాజరైన ప్రజలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

