సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. పగటి సమయంలో వేసవి సమీపిస్తుండడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం వేళ.. ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే రాత్రి, ఉదయం సమయంలో చలి వణికిస్తున్నది. వృద్ధులు, పిల్లలు ఇబ్బ ందులు ఎదుర్కొంటున్నారు.
ఇలా భిన్న వాతావరణంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు నగరంలో కనిష్ఠం 15.4, గరిష్ఠం 30.7 డిగ్రీలు నమోదైంది. గాలిలో తేమ 24 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.