NIMS | ఖైరతాబాద్, మార్చి 21 : రోటరీ క్లబ్ మోయినాబాద్, ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ ఆర్థిక సహకారంతో నిమ్స్ దవాఖానలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ పీడియాట్రిక్ న్యూరాలజీ అండ్ ఎపిలెప్సీ విభాగాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ప్రారంభించారు. 4 వేల చదరపు ఫీట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ విభాగంలో ఆత్యాధునిక ఐసీయు, హెచ్ఎఎ, అడ్వాన్స్డ్ ఎపిలెప్సీ మానిటరింగ్ యూనిట్, పాలిస్కోనోగ్రఫీ, స్టీరియో ఈఈజీ తదితర పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ విధానంలో ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలో రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఖర్చు వస్తుందని, కాని నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ లాంటి ప్రభుత్వ పథకాలతో పూర్తిగా ఉచితంగా అందిస్తామని డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రీమియర్ ఎనర్జీస్ చైర్మన్ సురేందర్ పాల్ సింగ్, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి, డాక్టర్ రాంప్రసాద్, ఏకేఎస్ ఉదయ్ పిలానీ, నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ అమరేశ్ రావు మలెంపాటి, న్యూరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు.