అంబర్‌పేట : గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అంబర్‌పేట నియోజకవర్గంలోని పలు బస్తీల్లో సరైన రోడ్డు వసతి కల్పించలేకపోయారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ తురాబ్‌నగర్‌లో రూ.9లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ వంటి నిర్మాణాలతో అభివృద్ది శరవేగంగా జరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ సుధాకర్, వాటర్‌వర్క్ ఏఈ మాజిద్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, పార్టీ నాయకులు శ్రీరాములుముదిరాజ్, అరుణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్లకుంట ఓల్డ్ రామాలయం వీధిలో…
నల్లకుంట డివిజన్లోని ఓల్డ్ రామాలయం దగ్గర రూ.9.50లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఇక్కడ రోడ్లు అధ్వాన్నంగా మారడాన్ని బస్తీవాసులు తన దృష్టికి తెచ్చారని తెలిపారు.
వారి కోరిక మేరకు అధికారులను పిలిపించి తగిన ప్రతిపాదనలు తయారు చేయించి ఈ రోడ్డును మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, పార్టీ నాయకులు పాక చందర్, కిషన్‌రావు, సతీష్‌చంద్ర, భాస్కర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.