అసలే బస్ షెల్టర్లు లేక నగరవాసులు ఎండలో ఎండుతూ.. వానలో తడుస్తూ.. ఇబ్బందులు పడుతుంటే.. బోరబండలో భిన్న పరిస్థితి. ఇక్కడ ఏసీ బస్ షెల్టర్‌ను ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నాయి. ఇటీవల షెల్టర్ తాళాలు తీసి.. అధికారులు హడావుడి చేశారు.
అయితే మళ్లీ షెల్టర్‌కు తాళం వేశారు. శనివారం ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులు.. తాళం ఉన్న బస్ షెల్టర్ వద్ద నిల్చొని తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పక్కనే ఆలయం మెట్లపై మరికొందరు కూర్చోవాల్సి వచ్చింది. అసలే బస్ షెల్టర్లు లేక ఇబ్బందులు ఎదురవుతుంటే.. ఉన్న షెల్టర్‌కు తాళం వేసి ఉంచడం ఏమిటని ప్రయాణికులు మండిపడుతున్నారు.
-ఎర్రగడ్డ, ఆగస్టు 31