ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 24 : ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ నియామకాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. కళాశాల ప్రిన్సిపల్, ఓఎస్డీ టు వీసీ ఇద్దరూ కలిసి తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇప్పించుకున్నారని ఆరోపించారు.
ఈ ఉదాంతంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు అనుమానాలు ఉన్నాయని అన్నారు. తక్షణమే అవకతవకలకు పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు అశోక్నాయక్, సతీశ్గౌడ్, నాగరాజు, వెంకటేశ్, గణేశ్, ప్రవీణ్, గోపి, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.