Parking Fee | సిటీబ్యూరో: నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న మాల్స్, మల్టీప్లెక్స్‌లపై చర్యలకు ఉపక్రమించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, తనిఖీలు చేసేందుకు సర్కిళ్ల వారీగా ప్రత్యేక బృందాలను నియమించినట్లు చెప్పారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్ కింద రిజిస్టర్ చేసుకొని, మల్టిపుల్ స్క్రీన్ నడిపిస్తున్నట్లు బయటపడిందన్నారు. అలాగే కొన్ని చోట్ల ఫుడ్ స్టాళ్లలో అమ్ముతున్న తినుబండారాలు నాణ్యత లేనివిగా గుర్తించినట్లు తెలిపారు. కాగా, తనిఖీల్లో అక్రమాలను గుర్తించిన ఆయా మాల్స్‌కు, మల్టీప్లెక్స్‌లకు కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులకు నోటీసులు జారీ చేశారు.