హైదరాబాద్ : ప్రముఖ గాయని మంగ్లీపై ఫిర్యాదు చేసిన నాయవాది సుబ్బారావుకు పంజగుట్ట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టులో 27గా రీడింగ్ నమోదు అవ్వగా, మద్యం తాగి పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే రాత్రి తాగిన దానికి ఇప్పుడు టెస్ట్ చేయడం ఏంటని, కేసును పక్కదారి పట్టించేందుకే డైవర్షన్లు చేస్తున్నారని సుబ్బారావు ఆరోపించారు.
కాగా, సీఐ రామకృష్ణ రామకృష్ణ మాట్లాడుతూ..పోలీస్ స్టేషన్కు తాగి వచ్చాడని అనుమానంతో న్యాయవాదికి ఆల్కహాల్ టెస్ట్ చేశామన్నారు. టెస్టులో 27గా రీడింగ్ నమోదైంది, దానికి తగిన చర్యలు తీసుకున్నాం. మంగ్లీపై ఫిర్యాదు చేశారు కానీ ఆధారాలు ఇవ్వలేదలేని పేర్కొన్నారు. కోర్టు అనుమతితో కేసు నమోదు చేశాం. లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసులో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
పోలీస్ స్టేషన్కు తాగి వచ్చిన సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసిన న్యాయవాది
సింగర్ మంగ్లీ మీద ఫిర్యాదు చేసిన నాయవాదికి ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించిన పంజాగుట్ట పోలీసులు
టెస్టులో 27గా రీడింగ్ నమోదు అవ్వగా, మద్యం తాగి పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు నిర్ధారించిన పోలీసులు
రాత్రి తాగిన… https://t.co/w1cOM1NyAL pic.twitter.com/ia7AYT6MZm
— Telugu Scribe (@TeluguScribe) April 13, 2026