బన్సీలాల్‌పేట్, సెప్టెంబర్ 9 : క్యాన్సర్‌తో బాధపడే రోగులకు నొప్పి, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి గాంధీ దవాఖానలో తొలిసారిగా పాలియేటివ్ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ ఎన్ రాజకుమారి తెలిపారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆన్లైన్లో వర్చువల్ విధానంలో 34 చోట్ల ఈ పాలియేటివ్ కేంద్రాలను ప్రారంభించారు. సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పూర్ణయ్య, అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ డాక్టర్ చంద్రావతి ఇన్చార్జిలుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవిశేఖర్ రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ శేషాద్రి, వైద్యులు పాల్గొన్నారు.