ప్రసాదం.. అపవిత్రం
అన్యమతస్తులను ఆలయాల్లో నియమించవద్దని, ఎలాంటి పనులు చేయించవద్దని దేవాదాయ శాఖ చట్టం చెబుతుంది. కానీ ఇందుకు విరుద్ధంగా నగరం నడిబొడ్డున ఉన్న కాశీవిశ్వనాథుడి ఆలయంలో ఉన్న ఉపాలయంలో ఏకంగా ప్రసాదాలను, అన్నదానానికి సంబంధించిన వంటకాలను అన్యులే చేస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ప్రసాదాల తయారీకి అన్యమతస్తులు
- అమ్మవారి నివేదనలో పవిత్రత కరువు
- అన్నదానంలో వంటకాలన్నీ వారే చేస్తారు
- దేవాలయ ఈవో తీరుపై భక్తుల ఆగ్రహం
సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): అన్యమతస్తులను ఆలయాల్లో నియమించవద్దని, ఎలాంటి పనులు చేయించవద్దని దేవాదాయ శాఖ చట్టం చెబుతుంది. కానీ ఇందుకు విరుద్ధంగా నగరం నడిబొడ్డున ఉన్న కాశీవిశ్వనాథుడి ఆలయంలో ఉన్న ఉపాలయంలో ఏకంగా ప్రసాదాలను, అన్నదానానికి సంబంధించిన వంటకాలను అన్యులే చేస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసినా కార్యనిర్వహణాధికారి మాత్రం తనకు ఉద్యోగులు దొరకకపోతే ఏం చేయాలంటూ వారినే కొనసాగించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. సలీమ్ అనే వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో దేవాదాయశాఖ పరిధిలోని ప్రముఖ శివాలయంలో ప్రసాదం తయారు చేస్తున్నాడు. దేవాలయంలో ఉపాలయంగా ఉన్న అమ్మవారి ఉద్యాపనకు సంబంధించిన పూరీలు, శనిగెలు, రవ్వకేసరి ఇతడితో చేయిస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం
వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో అన్యమతస్తులను ఏ పనికి వినియోగించరాదంటూ కఠిన నిబంధన ఉన్నప్పటికీ ఈ ఆలయంలో మాత్రం వేరే వంటవారు దొరకడం లేదనే సాకుతో దొరికిన వారితో ప్రసాదాలు చేయించడం ఈ ఈవోకే చెల్లింది.
విషయం ఆ నోటా ఈ నోటా బయటకు రావడంతో ఆలయ అర్చకుడు అతడిని మందలించినట్లు సమాచారం. శివాలయంలో మాత్రం నివేదన ఒక పరిచారకుడితో చేయిస్తుండగా అమ్మవారికి మాత్రం ఏకంగా అన్యమతస్తులతో చేయించడం.. ఇదేమని అడిగిన దేవాదాయ ఉద్యోగులను వేధిస్తున్నట్లు ఆలయంలో చెప్పుకుంటున్నారు. వీరిని పెట్టుకోవడం ద్వారా తనకు కావలసిన ముడుపులు ముట్టడమే కాకుండా ఎక్కడైనా ఫంక్షన్లు ఉంటే వీరిని తక్కువ రేటులో తీసుకుపోతున్నారంటూ ఆలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆలయంలో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని కొందరు భక్తులు ఫొటోలు తీసి దేవాదాయశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవడంతో దేవాలయ అధికారి ప్రస్తుతం అతడిని పనికి రావద్దని చెప్పినట్లు తెలిసింది. అయితే వారం వారం వచ్చి అమ్మవారికి ఇచ్చే నివేదన మొదలుకొని భక్తుల కోసం జరిపే అన్నదానం వంటలు కూడా సలీమ్ అతడి బృందమే చేస్తున్నదని భక్తులు ఆరోపించారు.
ఇన్నిరోజులుగా తమకు ఈ విషయం తెలియదని, ఇదంతా అధికారి నిర్వాకమేనంటూ వారు మండిపడుతున్నారు. నివేదన మొదలుకొని ప్రసాదాల తయారీ, అన్నదానానికి సంబంధించిన వంటకాలను అన్యమతస్తులు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా అడపాదడపా ఆ వ్యక్తి దేవాలయం వద్ద తచ్చాడుతుండడంతో ఎందుకు వచ్చావంటే అధికారి రమ్మన్నాడంటూ చెప్పడంతో అసలు గుళ్లో ఏం జరుగుతుంది.. ఆలయ వ్యవస్థకు, ఆచారాలకు భంగం కలిగించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ భక్తులు నిలదీస్తున్నారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులను భక్తులు డిమాండ్ చేశారు. ఆ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

