ఖైరతాబాద్, నవంబ ర్ 8: తెలంగాణలో రైతులకు 24 గంటల వి ద్యుత్తు అందిస్తున్నారని, కర్ణాటకలో 7 గంటలని చెప్పి కేవలం 3 గంటలే ఇస్తున్నారని కిసాన్ జాగృతి వికాస్ సంఘ్ (ఆర్) జాతీయ అధ్యక్షుడు పీ యుగేందర్ నాయుడు విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ సర్కారని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అందించని సదుపాయాలను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని అన్నారు.
కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి స్కూ ల్కు వెళ్లే పిల్లలకు బస్సులు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ప్రతి మహిళకు రూ.2 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, వెయ్యి మంది దరఖాస్తు చేసుకుంటే 100 మందికే ఇచ్చి మిగిలిన వారికి చేయి చూపిస్తున్నదని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఉచిత పథకాలను తెలంగాణ ప్రజలు నమ్మితే ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక విధాలుగా పాటుపడుతున్నదని, అలాంటి ప్రభుత్వాలను కొనసాగించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని మూడో సారి గెలిపిస్తే వ్యవసాయ, పారిశ్రామిక తదితర రంగాల్లో తెలంగాణ దశ తిరుగుతుందని అన్నారు.