హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని శంభీపూర్లో (Shambipur) కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఎగిరి పక్కనే ఉన్న ఇంటి గోడపై పడింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం గోడపై ఉన్న కారును చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో కారును కిందికి దించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.
నిద్రమత్తులో ఇంటిగోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి
మేడ్చల్ – దుండిగల్ పియస్ పరిదలోని శంభీపూర్లో కారు బీభత్సం
కారును క్రేన్ సహాయంతో దింపిన ట్రాఫిక్ పోలీసులు pic.twitter.com/PZUcNw0KW7
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2025