శంషాబాద్ రూరల్, జనవరి 12: శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడు ఎవ్వరికీ అనుమానం రాకుండా మొబైల్ ఫోన్ కవర్లో దాచి బంగారం తీసుకువచ్చాడు.
కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా.. అతడి వద్ద 583.11 గ్రాముల బంగారం బయటపడింది. ఆ బంగారం విలువ రూ. 33.57లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.