ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి డాక్టర్ శ్రీనివాస్ నల్లెల రాసిన ‘స్పోర్ట్స్ సైకలాజికల్ అప్లికేషన్స్ ఫర్ ఫుట్‌బాల్ అండ్ హాకీ ప్లేయర్స్’ పుస్తకాన్ని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకం ఫుట్‌బాల్, హాకీ క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. పుస్తక రచయితను అభినందించారు. డాక్టర్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, ఎడ్యుకేషన్ విభాగం డీన్ ప్రొఫెసర్ వి. సత్యనారాయణ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్, విభాగం హెడ్ ప్రొఫెసర్ దీప్లా, ప్రొఫెసర్ సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.