హైదరాబాద్ : మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ (MANU) యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ (OU) విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా తీసుకోవాలని చూస్తోందని, ప్రభుత్వ తీరును తాము నిరసిస్తున్నామని, ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో విద్యార్థుల నిరసన ప్రదర్శన చేశారు.
ప్రభుత్వం వెంటనే ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూసేకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా మరెన్నో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా తీసుకోవాలని చూస్తుందని ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిరసనకు దిగిన విద్యార్థులు
ప్రభుత్వం… https://t.co/EOFCWekw0w pic.twitter.com/A4DMtk0YQi
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2026