సికింద్రాబాద్, జనవరి 21: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాలుగా సహకరిస్తామని ఓయూ పూర్వ విద్యార్థులుగా, విద్యార్థి సంఘ ప్రతినిధులు అన్నారు. 1977 నుంచి 1988 వరకు ఓయూ విద్యార్థి సంఘానికి ప్రాతినిధ్యం వహించిన పలువురు పరిపాలనా భవన్లో ఉప కులపతి ఆచార్య కుమార్ మొలుగారం, రిజిస్ట్రార్ ఆచా ర్య జి.నరేశ్ రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితేందర్ నాయక్ తో భేటీ అయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ అధికారిక విద్యార్థి సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఉప కులపతి ఆచార్య కుమార్ మొలుగారంను మంగళవారం ఘనంగా సతరించారు. పూర్వ విద్యార్థులుగా, విద్యార్థి సం ఘ ప్రతినిధులుగా ఓయూ అభ్యున్నతికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా ప్రతిపాదించారు.
ఓయూకు పునర్వైభవం తీసుకురావటంతో పాటు ఓయూ కున్న ఖ్యాతి, ప్రపంచ స్థా యి గుర్తింపును కాపాడుకోవాలని ఆకాంక్షించారు. అకడమిక్ ఎక్సలెన్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్, మెరుగైన మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు సహకా రం, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం, ఓయూతో పరిశ్రమల భాగస్వామ్యం, సుపరిపాలన, ప్రమోషన్ అండ్ బ్రాండింగ్, నైతిక విలువలు, ఆర్థిక సహకారం తదితర అంశాల్లో మెరుగుదల కోసం తగిన చర్యలు చేపట్టాలని పూర్వ విద్యార్థి సంఘ నాయకులు కోరా రు. ఓయూలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓయూ సమగ్రాభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని వీసీ కుమార్ కోరారు. విద్యా, పరిశోధన, రాజకీయాల్లో ఓయూ క్రియాశీలకంగా ఉండేదని అలనాటి జ్ఞాపకాలను ఓయూ అధికారులతో పూర్వ విద్యార్థి నాయకులు పంచుకున్నారు. సహాయ సహకారాలు అంచేందుకు తమ శాయాశక్తుల కృషి చేస్తామని హామీ ఇచ్చారు.