Osmania Hospital | సుల్తాన్‌బజార్, జనవరి 31: ఉస్మానియా దవాఖానలో గురువారం నుంచి నాలుగు నెలల పాటు ఎంఆర్ఐ స్కాన్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి. వైద్యశాలలో ఇన్పేషెంట్లుగా ఉన్న రోగుల్లో అవసరమైన వారికి గాంధీ, ఎంఎన్‌జే దవాఖానల్లో ఎంఆర్ఐ స్కాన్ పరీక్షలు చేయనున్నారు.
ఉస్మానియాలో 16 ఏండ్ల కిందట ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ యంత్రం శిథిలావస్థకు చేరింది. మరో నాలుగు నెలల్లో నూతన యంత్రం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అప్పుటివరకు ఇన్‌పేషెంట్లు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు.