Care Hospital | ఖైరతాబాద్, జూలై 17 : ఒకే సర్జన్.. ఏకకాలంలో 17 కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించాడు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సంజీబ్ కుమార్ బెహెరా ఈ అరుదైన ఘనత సాధించారు. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరం ఉన్న 17 మందికి ఆస్పత్రిలో కీళ్ల మార్పిడి చికిత్స చేయాల్సి ఉంది. డాక్టర్ సంజీబ్ కుమార్ దీనిని చాలెంజింగ్ తీసుకొని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ శస్త్ర చికిత్సలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశారు. అరుదైన రికార్డు సృష్టించిన ఆ వైద్యుడిని ఆస్పత్రి యాజమాన్యం అభినందించింది.