బంజారాహిల్స్, జూన్ 16: నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని సీఎం పీఠం ఎక్కిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్పీ) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు భాగవతుల సాయి మహేశ్ అన్నారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ వీఆర్పీ ఆధ్వర్యంలో సోమవారం సీఎం రేవంత్ నివాసం ముట్టడికి యత్నించగా, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రధాన రోడ్డుపై బైఠాయించిన వీఆర్పీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రేటర్ అధ్యక్షుడు సాయి మహేశ్ మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అంటూ ఇచ్చిన హామీ, ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ తదితర హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు.