RS Praveen Kumar | పోక్సో కేసులో నిందితుడైన బండి సాయి భగీరథ్ ఎక్కడ తలదాచుకున్నాడనేది కేవలం రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మాత్రమే తెలుసునని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 9 రోజులు గడుస్తున్నా ఈ రోజు వరకు బండి భగీరథ్‌ను పట్టుకోలేదు.. కానీ NTV రిపోర్టర్ దొంతు రమేష్, బీఆర్ఎస్ కార్యకర్త నల్లబాలు, బీఆర్ఎస్ నాయకుడు కృషాంక్, జర్నలిస్ట్ రేవతి, లగచర్ల రైతులను మాత్రం రాత్రికి రాత్రే అరెస్ట్ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పేరు ప్రస్తావించొద్దని కోర్టు నుండి గ్యాగ్ ఆర్డర్ తీసుకు వచ్చాడని.. మరి ఈ మైనర్ అమ్మాయి మీద కూడా వార్తలు రాస్తున్నారు కదా.. ఆ చిన్న అమ్మాయి గ్యాగ్ ఎలా తెచ్చుకుంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బాధిత అమ్మాయి తరఫున తల్లి లాగా మంత్రి సీతక్క గ్యాగ్ ఆర్డర్ తీసుకు రావొచ్చు కదా అని సూచించారు. పోలీస్ వాళ్లేమో కోర్ట్ ఆర్డర్ వస్తే కానీ మైనర్ మీద వేసిన వార్తలు తీసేయలేం అంటున్నారు.. అందుకోసమేనా మీకు జీతాలు ఇచ్చేది..?
ప్రధాన మంత్రి పర్యటన బందోబస్త్ కార్యక్రమంలో పోలీసులు బిజీగా ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఈ బందోబస్త్ కార్యక్రమంలో ఎక్కడా కూడా పేట్ బషీరాబాద్ ఏసీపీ, డీసీపీ పాల్గొనలేదు. బందోబస్త్ కార్యక్రమంలో 10,000 మంది పాల్గొంటే రాష్ట్రంలోని మిగతా పోలీసులు ఏం చేస్తున్నారన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి నిస్సహాయ ముఖ్యమంత్రిగా, నిస్సహాయ హోంమంత్రిగా తన కొడుకును అప్పగించాలని బండి సంజయ్‌ను అడుక్కుంటున్నాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
బండి భగీరథ్ ఎక్కడ తలదాచుకున్నాడు అనేది కేవలం రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్‌లకు మాత్రమే తెలుసు
9 రోజులు గడుస్తున్నా ఈరోజు వరకు బండి భగీరథ్ ను పట్టుకోలేదు
కానీ NTV రిపోర్టర్ దొంతు రమేష్, బీఆర్ఎస్ కార్యకర్త నల్లబాలు, బీఆర్ఎస్ నాయకుడు కృషాంక్, జర్నలిస్ట్ రేవతి, లగచర్ల రైతులను… pic.twitter.com/Jg816oEyhP
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026
ప్రధాన మంత్రి పర్యటన బందోబస్త్ కార్యక్రమంలో పోలీసులు బిజీగా ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు
ఈ బందోబస్త్ కార్యక్రమంలో ఎక్కడా కూడా పేట్ బషీరాబాద్ ఏసీపీ, డీసీపీ పాల్గొనలేదు
బందోబస్త్ కార్యక్రమంలో 10,000 మంది పాల్గొంటే రాష్ట్రంలోని మిగతా పోలీసులు ఏం చేస్తున్నారు
ఈరోజు రేవంత్… pic.twitter.com/ptoMI3BmCV
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026