OTS | సిటీబ్యూరో, అక్టోబరు 22(నమస్తే తెలంగాణ): వన్ టైం సెటిల్మెంట్ పథకం (ఓటీఎస్) ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం జీవో ఇచ్చిన 17 రోజుల తర్వాత మంగళవారం నుంచి వినియోగదారుల ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్లను చేర్చారు. పెండింగ్ బిల్లులను చెల్లించి ఆలస్య రుసుముతో పాటు వడ్డీపై రాయితీ పొందాలని జల మండలి ఎండీ అశోక్ రెడ్డి ఈ సందర్భంగా బకాయిదారులకు విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించని వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ పథకం ఈ నెల 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లుల్ని చెల్లించి, నగర ప్రజలకు తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సేవలందిస్తున్న జల మండలికి సహకరించాలని కోరారు.
సందేహాలుంటే 155313 కి కాల్ చేయొచ్చు.
జల మండలి పరిధిలో 13.50 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా.., ఈ వన్‌టైం సెటిల్మెంట్ పథకంతో 7 లక్షలకు పైగా వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. వీరి వద్ద నుంచి అసలు మొత్తం దాదాపు రూ.1706 కోట్లు బకాయీలు రావాల్సి ఉంది. కాగా, రూ.1189 కోట్ల బకాయీలు మాఫీ అవుతాయి. జల మండలి వినియోగదారుల క్యాన్ నంబర్‌కు అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్‌కు బకాయి మొత్తం, ఎంత చెల్లించాలి? ఎంత మాఫీ అవుతుంది? తదితర వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతోంది. సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్బుక్, ఎలక్ట్రానిక్ మీడియా, ఎఫ్ఎం రేడియో, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ఓటీఎస్ -2024 పథకంపై అవగాహన కల్పిస్తోంది. ఓటీఎస్ పథకంపై ఏవైనా సందేహాలుంటే జల మండలి కస్టమర్ కేర్ నం. 155313కు ఫోన్ చేసి వాటిని నివృత్తి చేసుకోవచ్చు.
చెల్లింపు విధానం..