Hyderabad | హైదరాబాద్ : ఆదివారం రాత్రి గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి వట్టినాగులపల్లిలోని ఓ ప్రహరీగోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.