Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనంపై ముగ్గురు స్నేహితులు అతి వేగంతో వెళ్తుండగా న్యాక్ ప్రధాన ద్వారం వద్ద అదుపు తప్పింది. దీంతో పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న అజయ్ (27) అక్కడికక్కడే మరణించాడు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితులను జగిత్యాల జిల్లా కోరుట్ల వాసులుగా గుర్తించారు.