Hyderabad | హైదరాబాద్ అమీర్‌పేటలో ప్రమాదం జరిగింది. స్వాతి అంకూర్ భవనంలో లిఫ్ట్ లేకుండానే డోర్ తెరుచుకుంది. అది గమనించని ఓ వ్యక్తి లిఫ్ట్‌లో నుంచి సెల్లార్లో పడిపోయాడు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. తన కుమారుడి కోచింగ్ కోసం సదరు వ్యక్తి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
లిఫ్ట్ ప్రమాదంలో గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, లిఫ్ట్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన భవన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.