Road accident | రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి…ఒకరికి గాయాలు

సైదాబాద్ : ఇద్దరు యువకులు పల్సర్బైక్పై అతివేగంగా వెళ్తూ డీసీఎం ను ఢీ కొనడంతో ఒకరు దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న సంఘటన మంగళవారం సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం…రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధిలోని కలకొండ గ్రామానికి చెందిన కె. రాములు మీర్పేట బాలాజీనగర్ నివాసముంటూ స్థానికంగా కూలీ పనిచేసుకుని జీవిస్తున్నాడు.
ఆతని కుమారుడు కలకొండ యోగి (19) మరో యువకుడు రేవంత్ కుమార్ (22) పల్సర్ బైక్ టీఎస్29ఎల్ 8324పై మాదన్నపేట వైపుకు వెళ్తుండగా ఐఎస్ సదన్ చౌరస్తా సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్ను ఏపీ12యు 5207 నెంబర్ గల డీసీఎం ఢీకొ్ట్టింది.
దీంతో తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికుల సహాయంతో పోలీసులు ఉస్మానియా దవాఖానకు తరలించగా, కలకొండ యోగి అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడ్డ రేవంత్కుమార్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
మృతుడి తండ్రి కె. రాములు ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా, వేగంగా డీసీఎం నడిపిన డ్రైవర్ శ్రీశైలంను పోలీసులు ఆదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఎస్ఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు జరుపుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

