రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ జంటను కారు ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడికక్కడే మృతిచెందింది. యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును ఆపకుండా పరారయ్యాడని, అతనిపై కేసు నమోదుచేశామని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించి, నిందితుడిని పట్టుకుంటామన్నారు.