ఆదిబట్ల: ఆదిబట్ల ఓఆర్ఆర్పై (ORR) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిచి ఉన్న కారును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఓఆర్ఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తలించారు.
అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రావిర్యాల ఎగ్జిట్-13 నుంచి బొంగ్లూర్ ఎగ్జిట్-12కు వెళ్తుండగా ఓఅర్ఆర్పై ఆపిన కారును వెనుక నుంచి లారీ ఢీ కొట్టిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.