హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్‌లో (Madhapur) దారుణం చోటుచేసుకున్నది. మాదాపూర్‌లోని ప్రముఖ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డులో నలుగురు దుండగులు దోపిడీకి యత్నించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు యువకులను బంగారం, డబ్బుల కోసం బెదిరించారు. ఈ క్రమంలో వారు ఎదురుతిరగడంతో దుండగులు వారిపై కత్తులతో దాడి చేశారు. దీంతో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతుడిని ఖాజాగూడకు చెందిన జయంత్ గౌడ్‌గా గుర్తించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దుండగులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.