Hyderabad | కాచిగూడ, ఏప్రిల్ 30 : అనారోగ్యంతో రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వృద్ధుడు(70) అనారోగ్యంతో కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం 2-3 మధ్య మంగళవారం రాత్రి మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవఖానకు తరలించారు. మృతుని ఒంటిపై నీలి రంగు చొక్కా ధరించి, ఎత్తు 5.5 కలిగి ఉన్నట్లు తెలిపారు. మృతుని వివరాల కోసం 9948695948 లో సంప్రదించాలని హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.