దుండిగల్, అక్టోబర్ 5 : నగరంలోని మియాపూర్, మదీనాగూడకు చెందిన సింగమనేని విజయలక్ష్మి(70) అనే వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో మరణించింది. అయితే పార్థీవదేహాన్ని అందరిలా దహనం చేయకుండా భవిష్యత్ తరాలకు పరిశోధన నిమిత్తం బాచుపల్లి మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్(మామ్స్) కాలేజీకి శనివారం దానం చేశారు.
మరణించిన తరవాత శరీరాన్ని పూడ్చడం, దహనం చేసే దానికన్నా వైద్య కళాశాలకు ఇవ్వడం ద్వారా ఎంతో మంది వైద్య విద్యార్థులకు ఉపయోగపడుతుందని, అందుకే ఇటువంటి సముచిత నిర్ణయం తీసుకున్నామని మృతురాలి భర్త హన్మంతరావు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హరికృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నవీన్ కుమార్లు వారిని అభినందించారు.