చార్మినార్ : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ వృద్ధుడు కనిపించకుండా పోయిన ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే షబ్బీర్ అలీ (60) ఈ నెల 22న ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి చేరుకోలేదు. దాంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తెలిసిన వారిని, బంధువులను వాకబు చేశారు.
అయినా షబ్బీర్ అలీ ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో అతని కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సౌమ్య తెలిపారు. వృద్ధుడికి మానసిక సమస్యతోపాటు చెవుడు కూడా ఉన్నదని తెలిపారు. షబ్బీర్ అలీని ఎవరైనా గుర్తిస్తే చార్మినార్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.