హైదారాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని అని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ప్రాణ స్నేహితుడిని అని చెప్పుకొని లక్షల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన సూర్యాభాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒళ్లంతా బంగారం ధరించి గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్గా చెప్పుకుంటూ తక్కువ ధరకు స్వచ్ఛమైన బంగారం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని ముఖం చాటేసేవాడు.
డబ్బులిచ్చి నెలలు గడుస్తున్నా బంగారం ఇవ్వలేదని ప్రశ్నించిన వారిపై ఎదురుతిరిగి బెదిరించేవాడు. దీంతో మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును నారాయణగూడ పోలీస్ స్టేషస్‌కు బదిలీ చేసినట్లు అత్తాపూర్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.