పాతబస్తీలో శనివారం గణనాథుల నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా కొనసాగింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల పర్యవేక్షణలో.. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బొజ్జ గణపయ్యల నిమజ్జనోత్సవం.. కన్నుల పండువగా సాగింది.
ఉప్పుగూడ, ఛత్రినాక, గౌలిపుర, మొగల్పురా, అలియాబాద్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, శంషీర్‌గంజ్, మీరాలంమండి, దూద్‌బౌలి ప్రాంతాల నుంచి గణనాథులు చార్మినార్ కేంద్రంగా నయాపూల్ మీదుగా సాగర తీరానికి చేరుకున్నాయి.