సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ): కోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ హైడ్రా చేస్తున్న పనులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా హైడ్రా మరోసారి పెడచెవిన పెట్టింది. తమ తీర్పు అందిన 24 గంటల్లోగా సదరు సంస్థ భూమిలో కూల్చివేతలకు ముందున్న స్థితిని కల్పించి సంస్థకు అప్పగించాలని ఇచ్చిన తీర్పును పట్టించుకోలేదు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులే హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి నేరుగా హైడ్రా పెట్టిన బోర్డులు, ఫెన్సింగు తొలగించి తమ స్వాధీనంలోకి తీసుకోవడం హైడ్రాకు చెంపపెట్టుగా చెప్పాలి.
సోమవారం కూకట్‌పల్లిలోని ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధులు తమ వారితో కలిసి హైడ్రా స్వాధీనం చేసుకున్న తమ భూమి వద్దకు వచ్చారు. కోర్టు తీర్పులో పేర్కొన్నట్లుగా హైడ్రా తమ భూమిలో కూల్చివేతలు చేపట్టడానికి ముందున్న స్థితిని కల్పించి తిరిగి తమకు అప్పగిస్తారని చూసినప్పటికీ హైడ్రా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎన్వీఎన్ ప్రతినిధులు తమ భూమి వద్దకు వచ్చే సమయం వరకు అక్కడే ఉన్న హైడ్రా సిబ్బంది, డిజాస్టర్ వాహనం.. ఎన్వీఎన్ ప్రతినిధులతో పాటు మీడియా కూడా వస్తుందని తెలుసుకుని అక్కడినుంచి జారుకున్నారు.
ఆ తర్వాత ఎన్వీఎన్ ప్రతినిధులు మీడియా సమక్షంలో కోర్టు తీర్పు ప్రకారం తమ భూమిని స్వాధీనం చేసుకుని అక్కడ హైడ్రావేసిన ఫెన్సింగ్ తొలగించడంతో పాటు వారు పెట్టిన బోర్డులను కూడా తీసేశారు. ఆ తర్వాత ఆ స్థలంలో తమ బోర్డు పెట్టారు. ఈ సందర్భంగా హైడ్రా తీరును వ్యతిరేకిస్తూ సంస్థ సభ్యులతో పాటు అదే స్థలంలో ఉన్న కనకదుర్గ సొసైటీ ప్రతినిధులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కాగా హైడ్రా సిబ్బంది, డిజాస్టర్ వాహనంతో గత రాత్రి మళ్లీ అక్కడికి చేరుకున్నారు. ఇదేంటని బాధితులు ప్రశ్నించగా, తాము ఇక్కడే ఉండాలని పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం.
గత నెల 25న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ నెంబర్లు 1003 నుంచి1006 వరకు ఉన్న 13.17 ఎకరాల భూమిలో గత వారం హైడ్రా ఈదులకుంట, ప్రభుత్వ స్థలమంటూ అక్కడున్న నిర్మాణాలను తొలగించింది. అదే సమయంలో భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఈ భూమి హైడ్రా సంరక్షణలో ఉందంటూ అక్కడ బోర్డులు పెట్టారు. భూమి దగ్గరే హైడ్రా డిజాస్టర్ వాహనాన్ని పెట్టుకుని ఎవరూ ఆ ప్రాంతం వైపు వచ్చినా వారిని వెనక్కు పంపించారు. అయితే హైడ్రా చేసిన విధ్వంసంపై ఆ భూమి తమదేనంటూ అనేక ఉత్తర్వులు, స్థానిక , జల్లా అధికారులు ఇచ్చిన తీర్పులతోపాటు హైకోర్టు ఉత్తర్వులు చూపించినా హైడ్రా మాత్రం అవేవీ ఖాతరు చేయలేదు.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధిక్కరించి భూమి స్వాధీనం చేసుకుంది. కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తి మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటున్నారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఎన్వీఎన్ సంస్థ ప్రతినిధులు హైకోర్టులో ఉల్లంఘన కేసు వేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక హైడ్రా కమిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులివ్వకుండా కూల్చేసి విజయమని చెప్పడం కోర్టు అధికారాన్ని కించపరచడమేనని చెప్పారు. కూల్చిన నిర్మాణాలను హైడ్రా పునరుద్ధరించాలని, పిటిషనరే తిరిగి కట్టుకుంటే వారు పెట్టిన ఖర్చును అధికారుల సొంత నిధుల నుంచి రాబట్టుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఎన్వీఎన్ ప్రతినిధులు భూమిని స్వాధీనం చేసుకున్నారు.
అల్లాపూర్, జూన్ 1: యేడాది క్రితం హైడ్రా కమిషనర్ రంగానాథ్ ఈదుల కుంట అంటూ తమ భూమిని పరిశీలించారని బాధితులు తెలిపారు. అప్పట్లోనే అన్ని ప్రభుత్వ శాఖలు ఇచ్చిన అనుమతి పత్రాలను హైకోర్టులో ప్రవేశ పెట్టగా… సదరు భూమి విషయంలో హైడ్రా జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. న్యాయస్థానం ఆదేశాలు కూడా లెక్కచేయకుండా హైడ్రా తమ పరిధిదాటి సామాన్యులనే టార్గెట్ చేసి ఇబ్బందులపాలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాన్ని గౌరవించాలని, బుల్డోజర్లతో సామాన్యులను బయపెట్టవద్దని, హైడ్రా హడావుడి తగ్గించుకుని రాజ్యాంగ పద్ధతిని అనుసరించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ బాధితులు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్తో పాటు కనకదుర్గా వెల్ఫేర్ అసోసియేషన్ వారివి ఇదే భూమిలో 80 ప్లాట్లు ఉన్నాయి. మా భూమి విషయంలో ప్రభుత్వం పరంగా అన్ని రకాల అనుమతులు, సర్వే రిపోర్టులు ఉన్నా.. హైడ్రా బలవంతంగా మా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నది. తాము హైకోర్టు తీర్పు, భూమి పత్రాలు కమిషనర్ రంగనాథ్‌కు చూపించాలని ప్రయత్నించినా ఆయన పట్టించుకోలేదు. హైడ్రా సిబ్బంది వచ్చి కూల్చేసే సమయంలో కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు చూపించాం.. అయినా వారు తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటూ దౌర్జన్యంగా కూల్చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులే పట్టించుకోకపోవడంతో పాటు న్యాయాన్ని గౌరవించాల్సిన అధికారులు ఆ తీర్పులను ఉల్లంఘిస్తే పరిస్థితి ఏంటి. హైడ్రా దౌర్జన్యంగా వ్యవహరిస్తే మేం కోర్టును నమ్ముకున్నాం.
-బాబ్జీ, రిటైర్డ్ పోలీసు అధికారి, కనకదుర్గ సొసైటీ
హైకోర్టు తీర్పును ఉ ల్లంఘిస్తూ హైడ్రా మా భూమిలో అరాచకం, దుర్మార్గం చేసింది. హై కోర్టు 24 గంటల్లో హై డ్రా వేసిన ఫెన్సింగ్, బోర్డులు తీసేసి మా భూమి మాకు అప్పగించమని చెప్పి 48 గంట లు గడిచినా ఇప్పటివరకు చేయకపోవడంతోనే కోర్టు తీర్పు ప్రకారం మా భూమిని మేం స్వాధీన ం చేసుకున్నాం. హైడ్రాకు హైకోర్టు అంటే లెక్కలేదు.. కూకట్‌పల్లిలో సర్వేనెంబర్లు 100 నుంచి 1006వరకు 13.17ఎకరాలు మా భూమే. ఇం దుకు 2008లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. 2011లో ఆర్డీడీ సర్వే చేసి పంచనామా చేసిన తర్వాత అప్పటి రంగారెడ్డి కలెక్టర్ మాకు భూమిపై హక్కులను స్వాధీనం చేశారు. 2018లో ఆర్డీడీ మరొక సర్వే చేశారు. ఇన్ని ఉత్తర్వులు, రిపోర్టులు మాకు అనుకూలంగా ఉన్నప్పటికీ హైడ్రా సిబ్బంది దౌర్జన్యంగా వచ్చి మా సెక్యూరిటీ రూమ్, షెడ్లు, మిషనరీ తొలగించారు. మాకు నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు. ప్రస్తుతం ఈ భూమి విషయంలో కోర్టు ఉత్తర్వులను పాటిస్తున్నాం. హైడ్రావాళ్ల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లే దు. మీడియాతో రాగానే ఇక్కడినుంచి వెళ్లిపోయా రు. ఈ భూమి విషయంలో భవిష్యత్‌లో హైడ్రా జోక్యం ఉండకూడదని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది కూడా హైడ్రా గమనించాలి.
-ఎన్ ప్రవీణ్ కుమార్, ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్