బన్సీలాల్‌పేట/సిటీబ్యూరో, జూలై 6, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో నర్సింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రతినెలా ైైస్టెపెండ్ అందుకున్నవాళ్లు నేడు ఏడు నెలలుగా ైైస్టెపెండ్ ఇవ్వకపోవడంతో నానా అవస్థలుపడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోని నర్సింగ్ స్కూల్లో సీట్ వచ్చినందుకు ఆనందించాల్సింది పోయి, సకాలంలో ైైస్టెపెండ్ రానందుకు బాధపడే రోజులు వచ్చాయంటున్నారు.
ఎదురుచూపులు తప్పడం లేదు..
మూడేళ్ల నర్సింగ్ (జీఎన్ఎం) విద్యలో భాగంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ నర్సింగ్ స్కూళ్లలో 360 మంది జీఎన్ఎం కోర్సు చేస్తున్నారు. వైద్యవృత్తిలో సేవలందించాలంటే లక్ష్యంతో ఇంటర్, ఒకేషనల్ చేసిన వీళ్లంతా జీఎన్ఎం చదువులో భాగంగా ప్రాక్టికల్స్‌తో పాటు, గాంధీ విద్యార్థులు గాంధీ జనరల్ ఆసుపత్రిలో, ఉస్మానియా నర్సింగ్ విద్యార్థులు ఉస్మానియా ఆసుపత్రిలో ప్రాక్టిస్ చేయాల్సి ఉంటుంది. రోగి కే షీట్ పరిశీలించడం, వైద్యులు, నర్సులకు సహాయకులుగా ఉండటం, రోగులకు బీపీ, టెంపరేచర్లు పరీక్షించడం, వైద్యం కోసం వచ్చిన వారికి త్వరగా సాంత్వన కలిగేలా చేయడంలో జీఎన్ఎం విద్యార్థులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
ఉస్మానియా, గాంధీ నర్సింగ్ స్కూళ్లో చదివే విద్యార్థుల్లో 70 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతానికి చెంది, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చినవారే ఉండటం గమనార్హం. వారికిచ్చే నెలనెలైైస్టెపెండ్తోనే నెలరోజుల పాటు సబ్బులు, కాస్మోటిక్స్ వంటివి కొనుగోలు చేసుకుంటారు. వీరిలో 90 శాతం అమ్మాయిలు ఉండగా, వారందరికీ వసతి సౌకర్యం ఉంది. మిగతా పది శాతం అబ్బాయిల్లో కేవలం ఉస్మానియాలోని అబ్బాయిలకు మాత్రమే వసతి సౌకర్యం కల్పించగా, గాంధీ నర్సింగ్ స్కూల్ విద్యార్థులు మాత్రం బయట రూమ్, ప్రైవేట్ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే ఆ కొద్దిపాటి ైైైైస్టెపెండ్ వారికి సరిపోవడం లేదు. ఇప్పుడు ఆ ైైైస్టెపెండ్ కూడా పెండింగ్‌లోనే ఉండటంతో వారి పరిస్థితి దీనంగా మారింది. పెండింగ్ ైైైస్టెపెండ్ గురించి ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయాఆసుపత్రుల సూపరింటెండెంట్లు సరైన సమాధానాలు చెప్పడం లేదు.
ైైస్టెపెండ్ పెంచింది కేసీఆర్ ప్రభుత్వమే..
చాలీచాలని ైైస్టెపెండ్ తో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల పరిస్థితిని చూసిన నాటి కేసీఆర్ ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ైైస్టెపెండ్ పెంచేందుకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఉన్న ైైస్టెపెండ్ను మూడింతలు పెంచి అమలుకు ఆదేశించింది. అందులో భాగంగా గతంలో మొదటి సంవత్సరంలో రూ.1500 ఇస్తుండగా రూ.5000కు చేసింది. రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.1700లకు గాను రూ.6000 చేసింది. మూడో ఏడాదిలో రూ.1900 ఉంటే దాన్ని రూ.7000 చేసి విద్యార్థులకు అందించింది. పెంచిన ైైైైస్టెపెండ్ను సకాలంలో అందించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిన ధరలకు తగ్గట్టు ైైైైస్టెపెండ్ పెంచకపోగా, ఉన్నైై స్టెపెండ్ ను కూడా సకాలంలో ఇవ్వడం లేదు.