హైదరాబాద్ : నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్(Naredmet police station) పరిధిలోని బలరాం నగర్లో దారుణం చోటు చేసుకుంది. నర్సు మాధవిని(Nurse Madhavi) (34) గుర్తు తెలియని దుండగలు హతమార్చారు(Brutal murder). గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, మాధవి సఫిల్‌గూడలోని ఓ డెంటల్ క్లినిక్‌లో నర్సుగా పని చేస్తున్నది. తెలిసిన వ్యక్తులే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.