సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ) : సినీ నటుడు రవితేజ కొత్త వాహనం బీవైడీ-ఏటీటీఓ 3 ఎలక్ట్రిక్ కారు రిజిస్ట్రేషన్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో పూర్తయింది. ఆర్టీఓ రాంచందర్, ఎంవీఐ శీనుబాబు సమక్షంలో డిజిటల్ సంతకం, ఫొటో ప్రక్రియ పూర్తి చేశారు. రూ.34.49లక్షల విలువజేసే ఈ కారుకు ఆర్టీఏ అధికారులు బిడ్డింగ్ ఎమౌంట్ రూ.17,628తో టీఎస్09 జీబీ 2628 నంబర్‌ను కేటాయించారు. డ్రైవింగ్ లైసెన్స్ కాలపరిమితి ముగియడంతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఎల్ఎల్ఆర్(లెర్నర్ లైసెన్స్) ను తీసుకున్నారు.