నేరేడ్మెట్, జూలై 9 : విద్యార్థులు చదువుతో పాటు వివిధ రకాల పోటీల్లో రాణించాలంటే లక్ష్య సాధనతో పాటు నిరంతరం కృషి చేయాలని అక్షర కౌముది సంస్థ అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మి అన్నారు. బుధవారం అక్షర కౌముది సేవా సంస్థ దాతల సహకార సంయుక్త అధ్యర్యంలో నేరేడ్మెట్ ప్రాథమిక పాఠశాలలో విధ్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సంస్థ అధ్యక్షురాలు మాట్లాడుతూ సమాజ సేవలో అక్షర కౌముది సంస్థ ముందుంటుందని, నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు.
విద్యార్థుల భవితను నిర్ధేశించే శక్తి కేంద్రాలు పాఠశాలలు అని పేర్కొన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు 250మందికి ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ దాతల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘనంగా అందజేశారు. ఈకార్యక్రమంలో అక్షర కౌముది సంస్థ గౌరవ అధ్యక్షులు తులసి వెంకట రమణాచార్యులు, సంస్థ ప్రచార కార్యదర్శి బచ్చలి మాధవి, సహాయ కార్యదర్శి రామచంద్రుడు, సాంకేతిక కార్యదర్శి గరిమెళ్ల రాజేంద్రప్రసాద్, పద్మ, శ్రీనివాస్‌రావు, సుబ్బారావు, తెనాలి శేషు కుమార్, రాధిక కొండలలిత, పాఠశాల ఉపాధ్యాయులు ఉమారాణి , అనిత, పార్వతమ్మ, పద్మశ్రీ, దీప తదితరులు పాల్గొన్నారు.