harish rao | పత్రికల్లో వార్తలు వచ్చినా, పేద రైతులు వెళ్లి దరఖాస్తులు ఇచ్చినా హైడ్రా కళ్లు మూసుకుందంటే.. పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయమా..? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ..శని, ఆదివారాలు వస్తే పేదల ఇళ్లు కూలగొట్టే జీవో 99 హైడ్రా.. 7 వేల కోట్ల భూ కుంభకోణాన్ని ఎందుకు ఆపడం లేదు..? అని ప్రశ్నించారు.
నేను చెరువులను కాపాడుతున్నానని చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాదర్గుల్ కబ్జాలు కనిపించడం లేదా..? ఆ 373 ఎకరాల్లో 17 ఎకరాల లచ్చమ్మ కుంట (FTL), 6 ఎకరాల బఫర్ జోన్ ఉంది. ఆ చెరువుకు వచ్చే ఫీడర్ ఛానల్స్ అన్నీ ఈ కంపెనీలు ధ్వంసం చేశాయి. లచ్చమ్మ కుంట నిండితే అక్కడి నుంచి నాన్ చెరువు, మర్రివాని కుంట, రెడ్డి కుంట, సున్నం చెరువు, చివరకు ఇంజాపూర్ మాసం చెరువు వరకు నీళ్లు వెళ్తాయి. ఇంత జరుగుతున్నా హైడ్రా రంగనాథ్ కు ఎందుకు వినిపించడం లేదన్నారు. రేపు ఉదయం కల్లా హైడ్రా రంగనాథ్ అక్కడకు వెళ్లి చర్యలు తీసుకోకపోతే.. ఎమ్మెల్యేలతో కలిసి మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే అక్కడికి వెళ్తాం. అంతేకాకుండా అక్కడ ఉన్న 80 నుంచి 100 ఎకరాల గుట్టలను 12 ఎకరాలు లింగమయ్య గుట్ట మినహా మిగతాదంతా మింగేశారు.
ఇది ముమ్మాటికీ మంత్రి పొంగులేటి కంపెనీయే..
హైదరాబాద్ నడిబొడ్డున ఇంత మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు..? ప్రతిపక్షాల మీద సిట్ లు వేసే రేవంత్ రెడ్డి దీనిపై ఎందుకు మాట్లాడరు..? ఈ కంపెనీల కబ్జాల వెనుక సాక్షాత్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వాళ్లు చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు పెడుతున్నారు. ముందు కోహినూర్ గ్రూప్ అని, తర్వాత శిల్పా ఇన్ఫ్రా, మెగా కంపెనీ అని మార్చి మార్చి బోర్డులు పెడుతున్నారు.
కంపెనీస్ యాక్ట్ వెబ్ సైట్ ప్రకారం.. శిల్పా ఇన్ఫ్రా, శిల్పా రాఘవ LLP లలో మంత్రి పొంగులేటి కొడుకు హర్షారెడ్డి, లోహిత్ రెడ్డి, స్వప్న రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ కు కాంపౌండ్ వాల్ కోసం దరఖాస్తు చేసిన M/s AQ Square Realtors కు చెందిన క్రిస్టల్ మాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా హర్షారెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఇది ముమ్మాటికీ మంత్రి పొంగులేటి కంపెనీయే అని స్పష్టమైంది. రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ కబ్జాల వెనుక ఉన్నప్పుడు ఆర్డీవో, హైడ్రా లాంటి చిన్న అధికారులు వారిని ఎలా అడ్డుకుంటారు.. ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే హైడ్రాను పంపించి ఆ అక్రమ కాంపౌండ్ వాల్ ను కూలగొట్టాలి. ఆక్రమించిన వారిని అరెస్ట్ చేసి దొంగలు ఎవరో బయటపెట్టాలి. తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటున్న రైతులను తిరిగి ఆ భూముల్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు చేయడం మొదలు పెట్టాడు
నాదర్ గుల్ భూముల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు ఫెన్సింగ్ వేసి కబ్జా చేశాడు
పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ భూమిని ఎవరు కబ్జా చేయలేదు
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన… https://t.co/w6AGQGv1lo pic.twitter.com/RNIScrezI6
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2026