Secunderabad | సికింద్రాబాద్‌లో 5 కోట్ల విలువైన సొత్తు కొట్టేసిన నేపాలీ గ్యాంగ్.. ముంబై వెళ్లి మరీ పట్టుకున్న నార్త్ జోన్ పోలీసులు
Secunderabad | సికింద్రాబాద్ సింధీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. దొంగతనానికి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌ను నార్త్ జోన్ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ముంబై మీదుగా నేపాల్ పారిపోయేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు.
Secunderabad | సికింద్రాబాద్ సింధీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. దొంగతనానికి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌ను నార్త్ జోన్ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ముంబై మీదుగా నేపాల్ పారిపోయేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.5.5 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్, జవహర్‌నగర్ కాలనీలోని ఓం, పీజీ టవర్స్ మొదటి అంతస్థులో రాహుల్ గోయల్ నివాసముంటారు. 9వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్స్‌కు వెళ్లారు. 10వ తేదీన తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చే సరికి మెయిన్ డోర్ లాక్ పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. అల్మారా తాళాలు కూడా పగలగొట్టి ఉన్నాయి. అందులో ఉన్న నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలు, వజ్రాలు, రూ. 49 లక్షల నగదు కనిపించలేదు. చోరీకి గురైన సొత్తు విలువ దాదాపు రూ.4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇంటికి కాపాలాగా ఉన్న కమల్, అతడి కుటుంబ సభ్యులు కనిపించడం లేదని, వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని బాధితుడు పోలీసులకు వెల్లడించాడు. నేపాల్‌కు చెందిన వారు కావడంతో పక్కా ప్లాన్‌తో దోపిడీకి పాల్పడే అవకాశం ఉన్నదని, ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన నార్త్ జోన్ పోలీసులు.. నిందితులను ముంబైలోని మధుర బస్‌స్టేషన్‌లో పట్టుకున్నారు. కమల్ భార్య, ఇద్దరు పిల్లలు, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన కమల్ మాత్రం తప్పించుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

