మైలార్‌దేవ్‌పల్లి, జనవరి 23: రాజకీయాలకు అతీతంగా గౌడ కులస్తుల అభ్యున్నతికి పాటుపడేందుకు సంఘం సభ్యులందరిని కలుపుకొని ముందుకు వెళ్లడం జరుగుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మైలార్దేవపల్లిలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కల్లు సొసైటీల ద్వారా స న్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ బ్కారీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జూ పల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మె ల్యే టి.ప్రకాశ్ గౌడ్లను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ గౌడలను విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రోత్సహిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడతామన్నారు. గౌడల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రమాద బీమాను ఐదు లక్షల నుం చి 10 లక్షలకు పెంచేలా కృషి చేస్తామన్నారు.
అదే విధంగా వైన్సులు, బార్లలో గౌడ కులస్తులకు రిజర్వేషన్లను పెంచేలా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గౌడ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో దేవాలయాల వద్ద గౌడ భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే యాదాద్రిలో గౌడ భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మాణ పనులను చేపట్టి సేవలు సైతం ప్రారంభించామన్నారు. అలాగే వేములవాడ, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాల్లో గౌడ భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గౌడ సంక్షేమ సంఘాన్ని బలోపేతానికి కృషి చేస్తున్నామని, అందుకు అందరు సహకరించాలని కోరారు. సామాజిక వర్గీయులకు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన నేరుగా తన వద్దకు వచ్చి తెలుపాలన్నారు. ఏ ఒక్కరికి ఇబ్బందులు లే కుండా అందరి సమష్టి కృషితో ముందుకు వెళ్దామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రా ష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మైలార్దేవపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రేమ్‌దాస్ గౌడ్, హరిచరణ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజు గౌడ్ పాల్గొన్నారు.