ఖైరతాబాద్/హిమాయత్‌నగర్, నవంబర్ 8 : ఖైరతాబాద్ గులాబీ జనసంద్రంగా మారింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ నామినేషన్ పర్వం పండువలా సాగింది. ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, నియోజకవర్గ నలుమూలల నుంచి సుమారు ఐదువేల మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరై ఎమ్మెల్యే దానం వెన్నంటి నడిచారు. మహిళా కార్యకర్తలు దానంకు నీరాజనాలు పలికారు. ఆడపడుచులు బతుకమ్మ, బోనాలతో, రామ్ములమ్మ నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు.
ర్యాలీని ప్రారంభించిన మంత్రి తలసాని, మేయర్ విజయలక్ష్మి
ఖైరతాబాద్ బడా గణేశ్ చౌరస్తాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ నామినేషన్ కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ ర్యాలీలో సోమాజిగూడ, వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్ కార్పొరేటర్లు వనం సంగీత యాదవ్, మన్నె కవిత, వెల్దండ వెంకటేశ్, మహాలక్ష్మి రమన్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఖాజా సూర్యనారాయణ, కృష్ణ యాదవ్, మహేశ్ యాదవ్, భారతి నాయక్, ఖైరతాబాద్, సోమాజిగూడ, వెంకటేశ్వరకాలనీ బీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు అరుణ్ కుమార్, ఎస్కె అహ్మద్, రాములు చౌహాన్, మహేందర్ బాబు, మహేశ్ యాదవ్, బాక్సర్ అశోక్, లక్ష్మణ్ యాదవ్, రాంరెడ్డి, నాగరాజు, ఆనంద్ గౌడ్, పాల్గొనగా, ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
గణేశుడికి మొక్కి…అమ్మవారిని పూజించి
ఎమ్మెల్యే దానం నామినేషన్‌కు ముందు ఆనవాయితీగా ఖైరతాబాద్ బడా గణేశ్ ప్రాంగంలోని శ్రీ గణపతి దేవాలయాన్ని దర్శించుకున్నారు. సభా ప్రాంగణంలో స్థానిక సీనియర్ నాయకులు చౌదరి యాదయ్య యాదవ్ ఎమ్మెల్యేను సత్కరించారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ నాయకులు క్రేన్ సాయంతో భారీ గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం స్థానిక మహాంకాళి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ కోసం బయలుదేరి వెళ్లారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రం సుభిక్షం …
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లుగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించిందని ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బుధవారం హైదర్‌గూడలోని ఎంఏ ఫంక్షన్ హాల్లో హిమాయత్‌నగర్ బూత్‌స్థాయి ముఖ్య నాయకుల సమావేశం బీఆర్ఎస్ నాయకుడు రామన్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీల చేతిలో అధికారం పెడితే రాష్ట్ర భవిష్యత్ అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్,బీఆర్ఎస్ నాయకులు యాదగిరి, అశోక్‌కుమార్, ప్రభాకర్‌గౌడ్, నందు, కృష్ణయాదవ్, రాజేందర్‌కుమార్, గణేశ్, మహేశ్, జైస్వాల్, బింధ్యాజైస్వాల్, శ్రీనాథ్,శ్రీ కాంత్,మల్లేశ్,జక్కి, శేఖర్,శారద, కొండయ్య, అనీశ్, శ్రీహరి,అంబిక,పూజ పాల్గొన్నారు.