సిటీబ్యూరో : రాష్ట్రంలో లిఫ్ట్ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్ట్ పాలసీ తయారుచేసే బాధ్యతలను విద్యుత్ శాఖపై సర్కార్ పెట్టింది. కొంతకాలంగా పెండింగ్లో లిఫ్ట్ పాలసీ 2025ను మరికొద్దిరోజుల్లోనే అమల్లోకి తీసుకురానున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా లిఫ్ట్ పెట్టాలంటే తప్పనిసరిగా విద్యుత్ ఇన్స్పెక్షన్ విభాగం నుంచి ఎన్వోసీ తప్పనిసరిగా ఉండాలి.
ఈ నేపథ్యంలో పాలసీలో ఎటువంటి మార్గదర్శకాలు ఉండాలనే అంశాలపై విద్యుత్, ఫైర్, పోలీస్, ఇంజినీరింగ్ విభాగాలు చర్చిస్తున్నట్లు సమాచారం. లిఫ్ట్ ఇండస్టీప్రై ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ పరిశ్రమకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా చాలా మంది లిఫ్ట్ ఆపరేటర్లు తాము చేసే వ్యవస్థలో స్పీడ్ గవర్నర్లు, ఎమర్జెన్సీ బ్రేకులు వంటి సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.