మల్కాజిగిరి, ఫిబ్రవరి 4: కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తబస్తీలోని బస్తీ దవాఖానలో వ్యాక్సినేషన్ సెంటర్‌ను కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కట్టడికి వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌పై ఏఎన్ఎంలు అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యం కోసం బస్తీల్లో ప్రత్యేకంగా బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ప్రేమ్, జార్జి తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి, అల్వాల్ ఆరోగ్య కేంద్రాల పరిధిలో శుక్రవారం ఇంటింటికీ జ్వరసర్వే నిర్వహించారు. నియోజక వర్గంలోని మల్కాజిగిరి, అల్వాల్ ఆరోగ్య కేంద్రాల పరిధిలో 4721 ఇండ్లను సర్వేచేసి, స్వల్ప లక్షణాలు ఉన్న 58 మందికి హెల్త్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ ప్రసన్నలక్ష్మి, మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు రాజు, నాగమణి, కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.