సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): భారీ వాహనాలను ఏప్రిల్ 1 నుంచి మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోకి రద్దీ సమయాల్లో ప్రవేశంపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. రద్దీ సమయాల్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండడం, భారీ వాహనాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజల భద్రతతో పాటు ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు తప్పని సరిగా భారీ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. భారీ వాహనాలతో పాటు మధ్య తరహా మోటారు వాహనాలపై నిషేధం ఉంటుందన్నారు. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటలు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల మధ్య ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.