Cyber Crime | సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): స్టాక్ ట్రేడింగ్‌లో నో బ్రోకర్ ఫీజ్… మీరు లిమిట్ లేకుండా ప్రతి రోజు స్టాక్స్ కొనొచ్చు, అమ్మొచ్చు అంటూ నయా పంథాలో సైబర్‌నేరగాళ్లు అమాయకులను ఆకర్షిస్తున్నారు. స్టాక్ బ్రోకరింగ్ చేసే అసలైన సంస్థలు ఎంతో కొంత బ్రోకరేజి కమిషన్‌ను వసూలు చేస్తుంటాయి. కొందరు లావాదేవీలను, బట్టి మరికొందరు రోజు వారి ఒక్కసారి మాత్రమే కొంత కమిషన్ అంటూ డీమాట్ ఖాతాదారుల నుంచి వసూలు చేస్తుంటారు.
తమ సంస్థలో డీమాట్ ఖాతా తెరవండంటూ పలువురు ఫోన్లు చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. అయితే సైబర్‌నేరగాళ్లు మాత్రం కొన్ని సార్లు తక్కువబ్రోకరేజీ, మరికొన్ని సార్లు నో బ్రోకరేజి కమిషన్ మా వద్ద మీరు ట్రేడింగ్ చేస్తే కావాల్సిన టిప్స్ ఇవ్వడమే కాకుండా మా వద్ద ఉన్న ఎక్స్‌ఫర్ట్స్ నుంచి సలహాలు, సూచనలు ఇప్పిస్తామంటూ నమ్మిస్తూ మోసాలకు పాల్పుతున్నారు. సాధారణంగా స్టాక్స్‌పై అవగాహన ఉన్న వారికి ఈ మార్కెట్ గూర్చి తెలిసి ఉంటుంది.
బడంగ్‌పేట్‌కు చెందిన బాధితుడు బిటెక్ చేశాడు. లో బ్రేకరేజ్ కమిషన్‌తో ట్రేడింగ్ అఫర్ ఇస్తున్నామని, ట్రేడింగ్ ఎక్కువ చేసిన వాళ్లకు నో కమిషన్ అంటూ మేసేజ్ పంపించారు. అయితే తాము పంపించిన లింక్‌ను క్లిక్ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండంటూ సూచించారు. బాదితుడు లింక్ క్లిక్ చేసి రూ. 20 వేలు పెట్టుబడి పెట్టి ట్రేడింగ్ చేశాడు. అందులో రూ. 5 వేలు లాభం రావడంతో వాటిని విత్ డ్రా చేశాడు. ఒక్కసారిగా లాభాలు చూడడంతో అది నిజమని నమ్మాడు.
తరువాత డబ్బు డిపాజిట్ చేస్తూ ట్రేడింగ్ చేశాడు. అయితే లాభాలు మాత్రం స్కీన్ప్రై కన్పిస్తున్నాయి, విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. మీరు టార్గెట్‌కు చేరువలో ఉన్నారు.. మరికొంత ట్రేడింగ్ చేస్తే బ్రోకరేజ్ ఫీజు ఉండదు, మీ డబ్బు విత్ డ్రా చేసుకునే అవకావముంటుందంటూ నమ్మిస్తూ రూ. 6.16 లక్షలు పెట్టించారు. అయిత అందులో రూ. 1.08 లాభాలంటూ సైబర్‌నేరగాళ్లు బాధితుడికి పంపించారు. మోసానికి గురయ్యానని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.