భారీ వర్షానికి హైదరాబాద్-మేడ్చల్ దారిలో ఎడమవైపు నీళ్లు నిలిచిపోయాయి. పై నుంచి వరద నీరు భారీ ఎత్తున రావడం, కిందకి వెళ్లే మార్గం లేకపోవడంతో జాతీయ రహదారిపై నీరు నిలిచిపోయి.. ట్రాఫిక్ ఇబ్బందులు తల్తెత్తాయి. స్పందించిన మున్సిపాలిటీ, పోలీసులు, ట్రాఫిక్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, రహదారికి కుడి వైపు నీళ్లు వెళ్లే నాలాపై ఏజీఎస్ వెంచర్ నిర్వాహకులు ప్రహరీని నిర్మించారు.
ప్రహరీ కింద నుంచి నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసినా.. మట్టి కూడుకుపోవడంతో నీళ్లు వెళ్లే లేని పరిస్థితి ఏర్పడిందని గుర్తించారు. వెంటనే యంత్రాల సహాయంతో మట్టిని తొలగించి, నీటి వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే జాతీయ రహదారిపై నిజామాబాద్ వైపు వెళ్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో పాటు పోలీసు వాహనాలు ఆగి ఉండటాన్ని చూసి, కొద్దిసేపు ఆగారు. పోలీసు, మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి, పరిస్థితిపై ఆరా తీశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి.. వెళ్లిపోయారు.
-మేడ్చల్, ఆగస్టు 16 :