సిటీబ్యూరో, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): పాస్‌పోర్టు, వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లో ఉంటూ గంజాయి సరఫరా చేస్తున్న నైజీరియన్ ఒనురోహ్ సాలమన్ చిబూజ్ను హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి డిపోర్టేషన్ చేశారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం స్వదేశానికి హెచ్‌న్యూ పోలీసులు పంపించారు.
ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియాలోని అనంబ్రా రాష్ర్టానికి చెందిన చిబూజ్ 2014లో భారతదేశానికి మెడికల్ వీసాపై వచ్చి ఢిల్లీ, బెంగళూరు ఉంటూ, ఆపై హైదరాబాద్‌కు వచ్చాడని పోలీసులు తెలిపారు. అత్తాపూర్‌లో కిరాయికి ఉంటూ పుణె, ముంబై నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్మేవాడని.. అయితే టోలిచౌకీ పోలీస్‌స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం చిబూజ్ను నైజీరియాకు పంపామని పోలీసులు తెలిపారు.