కాచిగూడ,ఆగస్టు 17 : నిఫ్డ్ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు గల ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లామా, బీఎస్సీ ఫ్యాషన్, టెక్నాలజీ కోర్సులకు యువతి, మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నేషనల్ ఇన్ట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్(ప్ట్ డైరెక్టర్ కన్నెబోయిన రాముయాదవ్ తెలిపారు. మంగళవారం నిఫ్డ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఈ వృత్తి విద్యా కోర్సులకు అధిక డిమాండ్ ఉందన్నారు.
ఈ కోర్సులు పూర్తిచేసిన నిరుద్యోగులు ప్రఖ్యాతిగాంచిన ప్రైవేటు రంగాలలో యువతి,యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల వారు 9030610033/55లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.